ప్రధాని నివాస ముట్టడిని ఖండిస్తూ కమాన్‌పూర్‌లో బీజేపీ నిరసన
ప్రధాని నివాస ముట్టడిని ఖండిస్తూ కమాన్‌పూర్‌లో బీజేపీ నిరసన పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 24: ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించిన కాంగ్రెస్, కూటమి పార్టీల తీరును నిరసిస్తూ శుక్రవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి దేశ ప్రజలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు...