ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఓదెలలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

ఓదెలలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

పెద్దపల్లి డెస్క్ , అర్జున్ సమాచారం, సెప్టెంబర్ : 10 :

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, తెలంగాణలో నైజాం నిరంకుశత్వానికి, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ధైర్యంతో కొట్లాడి, వారిని ఉరికించి తరిమిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె చూపిన పోరాట పటిమ, ఆత్మగౌరవం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకట లక్ష్మాన్, వార్డు సభ్యులు అప్పని తిరుపతి, గోపతి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు చింతం కుమారస్వామి, పెరక సంఘం అధ్యక్షులు కానిగంటి ఎర్ర శంకరయ్య, మెరుగు సారంగం, నాగపూరి రవి, రామంచ అనిల్, చెరుకు శంకర్, చెరుకు శ్రీనివాస్, వంగరి చందు, తీర్తల కుమార్, రామినినేని రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.అలాగే రజక సంఘం అధ్యక్షులు పైడిపల్లి రమేష్, ఉపాధ్యక్షులు శతల్ల విష్ణు, సంఘం పెద్దలు మేడిచాల్మేల చంద్రయ్య, రామడుగు వెంకటేష్, మడికొండ వీరయ్య, శతల్ల రామస్వామి, శతల్ల శ్రీనివాస్, శతల్ల రవి, శతల్ల సమ్మయ్య, రామడుగు మల్లయ్య, శతల్ల కుమార్, మడికొండ రాకేష్, రామడుగు శ్రీనివాస్, శతల్ల వెంకటేష్, ఎలాబోతరం శ్రవణ్, మడికొండ వెంకటేష్, రామడుగు బుచ్చయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.