ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 3:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.

మంచిర్యాల ,ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు.

అర్జున్ సమాచారం నవంబర్ 8. మంచిర్యాల నియోజకవర్గము.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే

కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో M L A సతీమణి సురేఖ,మేయరు ధరణి మదుకర్, తూముల నరేష్, చిట్ల సత్యనారాయణ, పుదరి తిరుపతి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుడు, డీసీసీ జనరల్ సెక్రటరీ కల్వల జగన్ మోహన్ రావు, 49వ డివిజన్ అధ్యక్షుడు ఫాసి ఉల్లా ఖాన్,బియ్యాల సత్తయ్య ,కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో భాగస్వాములయ్యారు.

ఎమ్మెల్యే నివాసంలో పార్టీ శ్రేణుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి.