ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:38 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆర్.ఓ.ఎఫ్.ఆర్., భూ సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి

ఆర్.ఓ.ఎఫ్.ఆర్., భూ సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి
మంచిర్యాల అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 3.

జిల్లాలోని ఆర్.ఓ.ఎఫ్.ఆర్. భూ సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేద్దామని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ–ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజనుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం  భూ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు గిరిజనులకు సంబంధించిన భూ సమస్యలను చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవడం అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా కల్పించాల్సిన హక్కుల అమలు అంశాలపై చర్చించారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్. భూములకు సంబంధించిన సమస్యలను పరిశీలించి క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా గిరిజనులకు ఇబ్బందులు లేకుండా చూడాలని గిరిజనుల భూ హక్కుల పరిరక్షణకు సంబంధిత శాఖలు