ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 6:44 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కొరకొప్పుల సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళులు.

కొరకొప్పుల సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళులు.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // రామగిరి రిపోర్టర్.

రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొరకొప్పుల సత్యనారాయణ మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామమైన సుందిళ్లలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని సత్యనారాయణ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, సుందిళ్ల గ్రామానికి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొరకొప్పుల తులసిరామ్ గౌడ్, ఉమ్మడి కామాన్‌పూర్ మండల మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి, ఉమ్మడి రత్నాపూర్ మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, రామగిరి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్, సుందిళ్ల గ్రామ సర్పంచ్ మస్కుల నరేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గర్రెపల్లి ప్రవీణ్ గౌడ్, మాజీ అధ్యక్షుడు జనగామ కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.