ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 1:58 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆరెల్లి గట్టుమల్లు మృతదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళులు.

ఆరెల్లి గట్టుమల్లు మృతదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళులు.

అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన తొట్ల తిరుపతి యాదవ్, ఎల్లే రామ్మూర్తి.

అర్జున్ సమాచారం. నవంబర్ 8, రామగిరి రిపోర్టర్.

పెద్దపల్లి జిల్లా:రామగిరి,మండలంలోని రామయ్యపల్లె గ్రామానికి చెందిన ఆరెల్లి గట్టుమల్లు మృతి పట్ల మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

రామగిరి మండల మాజీ ఎంపీపీ ఆరెల్లి కొమురయ్య గౌడ్, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరెల్లి శ్రీనుల మాతృమూర్తి ఆరెల్లి గట్టుమల్లు మృతి చెందడంతో ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామయ్యపల్లె మాజీ సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్, నాగేపల్లి మాజీ సర్పంచులు తీగల సమ్మయ్య, ఎరుకల ఓదెలు, రామయ్యపల్లె గ్రామ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు దేవునూరి రాజేష్, ఉపసర్పంచ్ యాసం సతీష్, ఐఎన్‌టీయూసీ నాయకులు శంకేసి రాయమల్లు, గాజు వెంకటేష్, నాగేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు తీగల సదయ్య, రామగిరి మండల సీనియర్ రిపోర్టర్ పొన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆరెల్లి గట్టుమల్లు మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.