ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 2:35 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుమంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 03

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణ పనులను సందర్శించి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వీలైనంత త్వరగా ఈ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.