కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.ఆర్‌జీ-3 జీఎంకు ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వినతి

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.ఆర్‌జీ-3 జీఎంకు ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వినతి. రామగిరి: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 9. సింగరేణి ఆర్‌జీ-3 ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్‌జీ-3 ఏరియా జీఎంకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ ఆర్‌జీ-3 ఇన్‌చార్జి మబ్బు శంకర్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికుల సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి సర్క్యులర్ ప్రకారం ప్రతి నెల ఏడో తేదీలోపు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు....