అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు.
అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు. మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 28. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి వేళ బైక్‌పై పెట్రోలింగ్ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా, భద్రతా చర్యలను స్వయంగా తనిఖీ చేశారు. రాత్రి వేళల్లో పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై...