ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:29 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఈరోజు జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల లొ సైబర్ జాగృతి ఉత్సవాలు

ఈరోజు జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల లొ సైబర్ జాగృతి ఉత్సవాలు
జన్నారం ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 2:

జన్నారం నందు
సైబర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ సార్ ఎం విజిత్ కుమార్ సార్ విద్యార్థులను ఉద్దేశించి క్రమశిక్షణగా చదువుకొని, ఎలాంటి నేరాలకు గురి కాకుండా తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని మాట్లాడడం జరిగింది..
సైబర్ అవగాహన సదస్సు జన్నారం
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కిరణ్ సార్ సైబర్ నెరగాలపట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ మీ తల్లిదండ్రులకు అవగాహన కలిగించే విధంగా ఉండాలని వివరించడం జరిగింది, గంజాయి, డ్రగ్స్, మద్యపానం, సేవించి టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ నడపకూడదు అని విద్యార్థులకు వివరించారు, మేము ముందు అవగాహన కల్పిస్తాం తర్వాత సమాజంలో ఉన్న పౌరులు వినకుండా ఉన్నట్లయితే చట్టం తన పని తను చేసుకుంటూ ముందుకు వెళుతుంది చట్టం ముందు అందరూ సమానులే నేటి బాలలు రేపటి బావిపౌరులు, సమాజ అవగాహన ఉండాలని చిన్నచిన్న నేరాలు చేస్తూ ఉండకుండా క్రమశిక్షణగా చదువుకుంటూ ఉండాలని బోధించారు మీకు ఏమైనా సమస్య ఉంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి మాట్లాడవచ్చు అని వివరించారు ప్రియమైన విద్యార్థులారా మీరు క్రమశిక్షణగా చదువుకొని మీ తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని బోధించారు… గణపతి ఉత్సవాలు, కావచ్చు దసరా పండుగ కావచ్చు, దీపావళి పండుగ కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, ఈ ఉత్సవాలలో సైబర్ నెరగాళ్లు మనకు ఏదో ఒకటి ఆశ చూపి ఇందులో క్లిక్ చేసినట్లయితే మన డాటా ఆటోమేటిక్గా సైబర్ నేరగాళ్లకు అందుతుంది కాబట్టి విద్యార్థులారా చాలా జాగ్రత్తగా ఉండాలని ఉదయ్ కిరణ్ సారు విద్యార్థులకు బోధించారు
అధ్యాపక బృందం :G. బాపూరావు, M. రవీందర్, M. సాయికుమార్ , Y. నాగేశ్వరరావు, CH. మోహన్, A. దేవేందర్, CH. శశికళ మేడం, D. స్వరూప మేడం, B. కర్ణాకర్, M. కుమారస్వామి, N. శివరాం సార్ పాల్గొన్నారు.