పోలీసుల ఎన్కౌంటర్లో డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ హతం,
పోలీసుల ఎన్కౌంటర్లో డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ హతం, ఢిల్లీ : అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 20. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డి-కంపెనీతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా కార్యాలయం సమీపంలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో దుర్రానీ ప్రధాన నిందితుడు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు....