ఆది వరాహ స్వామి ఆలయ డైరెక్టర్ మృతి.
కమాన్ పూర్ నవంబర్ 5. అర్జున్ సమాచారం డెస్క్,
కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఆది వరాహ స్వామి ఆలయ పాలకవర్గ డైరెక్టర్ బొజ్జ సతీష్ బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన పార్టీ దేహానికి ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, ఫ్యాక్స్ చైర్మన్ ఇనగంటి భాస్కరరావు, జూలపల్లి సర్పంచ్ పోల్ దాసరి వనిత సాయికుమార్, ఆదివార స్వామి ఆలయ డైరెక్టర్లు తీగల రాజయ్య గౌడ్, పిల్లి రాజు, సాగి శ్రీనివాసరావు, బూస శ్రీనివాస్ గౌడ్, అనవేన శ్యామల సదయ్య,తోపాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెబల్ రాజ్ కుమార్, రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తులసి రామ్ గౌడ్, రత్నాపూర్ మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, రత్నాపూర్ మాజీ ఉపసర్పంచ్ కాటన్ సత్యం, భూస తిరుపతి, వార్డు సభ్యుడు చొప్పరి సంతోష్, తదితరులు పార్తివదేహానికి నివాళులర్పించారు. పలువురు డైరెక్టర్లు పాడిన మోయడం జరిగింది. సతీష్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.