ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 2:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేత.

దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేత.

ముంబై, నవంబరు 19, (అర్జున్ సమాచారం డెస్క్).

హజ్ యాత్రికులకు తాత్కాలిక విడిది కేంద్రంగా 1939లో దక్షిణ ముంబయి పక్మోడియా స్ట్రీట్‌లోని ‘హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా’ను నిర్మించారు. కానీ గడిచిన ఐదు దశాబ్దాల్లో అది పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని.. రోడ్డు విస్తరణ కోసం కూల్చివేయడానికి ముంబయి నగరపాలక సంస్థ  సిద్ధమవుతుంది. మొదటి అంతస్తులోని 10 గదులు, గ్రౌండ్ ఫ్లోర్‌లోని వివాదాస్పద ‘ప్రార్థనా మందిరాన్ని’ కూల్చివేయడానికి సన్నాహాలు జరుగుతున్నప్పటికీ, ఈ కట్టడం ఇప్పటికీ అండర్‌వరల్డ్ చరిత్రకు ఒక ఆనవాలుగా నిలిచింది.మరోవైపు, దీనికి అసలు యజమాని ఎవరనే దానిపై న్యాయపోరాటం కూడా నడుస్తోంది. ఈ పబ్లిక్ ఛారిటీ గెస్ట్‌హౌస్‌లోకి ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు అద్దెదారుగా ప్రవేశించి, ఆపై దానిని శాశ్వతంగా ఆక్రమించుకున్నాడు. అలా దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యమైన ‘డి-కంపెనీ’కి ఇది ప్రధాన కార్యాలయంగా మారిపోయింది.దావూద్ ఇబ్రహీం కస్కర్ మొదట్లో తన తల్లిదండ్రులు హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్, అమీనా బీ, తన తోబుట్టువులతో కలిసి ముసాఫిర్‌ఖానా రెండో అంతస్తులో నివసించేవాడు. 1970వ దశకం చివరలో, 1980లలో ముంబయి అండర్‌వరల్డ్‌లో దావూద్ ఇబ్రహీం ప్రాబల్యం పెరగడంతో, అద్దె ఒప్పందం కాస్తా కనుమరుగైంది. అతను ఆ భవనాన్ని కబ్జా చేసి రెండో అంతస్తు మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా ట్రస్ట్‌కు చెందిన ఈ యాత్రికుల విడిది అతడి నివాసంగా, కార్యాలయంగా, అప్రకటిత ప్రధాన కార్యాలయంగా మారిపోయింది.ఈ స్థలంపై దావూద్‌కు ఎలాంటి హక్కు ఉన్నట్లు ఏ పత్రాలూ లభించలేదు. దావూద్ ఇబ్రహీంకు గానీ, కస్కర్ కుటుంబంలోని ఏ ఒక్కరికి గానీ ఈ ఆస్తిపై కనీస రిజిస్ట్రేషన్ గానీ, యాజమాన్య హక్కుల ఆధారాలు గానీ లేవని ప్రభుత్వ సంస్థల రికార్డులు, న్యాయపత్రాలుస్పష్టం చేస్తున్నాయిగ్రౌండ్ ఫ్లోర్‌లోని 32 వాణిజ్య దుకాణాలు, పై అంతస్తులలోని 19 నివాస గదులు సాధారణ అద్దెదారులు, దుకాణదారుల ఆధీనంలో ఉండగానే, కేవలం ఆక్రమణ బలంతోనే ఈ ముఠా పక్మోడియా స్ట్రీట్ నుంచి చక్రం తిప్పింది. స్మగ్లింగ్ వస్తువులను దాచడానికి కూడా ఈభవనాన్ని ఉపయోగించేవారు1986లో దావూద్ ఇబ్రహీం భారత్ విడిచి పారిపోయిన తర్వాత కూడా అతడి అనుచరులు ఈ భవనంలో చురుకుగా ఉండేవారు. ఆ తర్వాత 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కుట్ర జరిగిన ప్రధాన కేంద్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. 1993 పేలుళ్ల తర్వాత, కస్కర్ కుటుంబం చెర నుంచి ఈ భవనాన్ని విడిపించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దావూద్ తల్లి అమీనా బీ, ఇతర కుటుంబ సభ్యులు అక్కడే నివసిస్తూ వచ్చారు. ఆ తర్వాతి కాలంలో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ దీనిని వినియోగించుకున్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్  నిబంధనల కింద దావూద్ ఆధీనంలోని రెండో అంతస్తును కోర్టు జప్తు చేసింది.1998, 2018 మధ్య కాలంలో స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్  కింద ఈ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ఈ ఉత్తర్వులపై అమీనా బీ, దావూద్ సోదరి హసీనా పార్కర్ ఢిల్లీ హైకోర్టు నుంచి సుంప్రీకోర్టు వరకు న్యాయపోరాటం చేశారు. చివరకు ఏప్రిల్ 2018లో సుప్రీంకోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేస్తూ, ముంబయిలోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు తమకు సంబంధం లేని గదుల కోసం కస్కర్ కుటుంబంతో ప్రభుత్వం పోరాడుతుండగానే, మరోవైపు ఈ భవనానికి అసలైన యజమాని అయిన ‘హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా ట్రస్ట్’ శిథిలావస్థలో ఉన్న ఈ కట్టడాన్ని రూ. 1.10 కోట్లకు ‘సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్’ కు విక్రయించేందుకు నవంబర్ 2015లో ఛారిటీ కమిషనర్ నుంచి అనుమతి పొందినట్లు బాంబే హైకోర్టు పత్రాలు చెబుతున్నాయి.ఈ విక్రయంతో భవన చరిత్రలో ఒక అధ్యాయం ముగిసినప్పటికీ, ఇదిదృష్టిని ఆకర్షించింది. నగరపాలక సంస్థ ఈ కట్టడాన్ని అత్యంత శిథిలావస్థలో ఉన్న, ప్రమాదకరమైన భవనంగా  వర్గీకరించింది. దీనిని కూల్చివేయడానికి హైకోర్టు ఆగస్టు2020లో అనుమతి మంజూరు చేసింది.ఆ తర్వాతి కొన్నేళ్లలో,అధికారులు పై అంతస్తులను ఖాళీ చేయించి, దావూద్ ఇబ్రహీం ఒకప్పుడు నివసించి, కార్యకలాపాలు సాగించిన మొదటి, రెండో అంతస్తులలోని ప్రధాన నివాస భాగాలను కూల్చివేశారు.మిగిలిన 10 మొదటి అంతస్తు గదులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ స్థలాన్ని కూడా త్వరలోనే కూల్చివేయనున్నట్లు నవంబర్ 16న BMC నోటీసు జారీ చేసే వరకు గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఉంది. రోడ్డు విస్తరణ కోసం, ప్రమాదకర కట్టడాన్ని తొలగించడానికి ఈ కూల్చివేత అవసరమైందిఅయితే, స్థానికులు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ, పేర్కొన్నట్లు గ్రౌండ్ ఫ్లోర్ కేవలం ‘ప్రార్థనా మందిరం’మాత్రమే కాదని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ తన నోటీసులో ఆ స్థలాన్ని ‘ప్రార్థనా మందిరం’గా పేర్కొంటూ, ప్రార్థనలు చేసుకునేవారు ప్రత్యామ్నాయ స్థలానికి వెళ్లాలని ఆదేశించిందిఅది ఒక మసీదు అని, వక్ఫ్ బోర్డుకు దానం చేసిన దాత ఆస్తి అని, అసలు మొదటి నుంచి దీనిని కి చట్టబద్ధంగా విక్రయించే హక్కు లేదని స్థానికులు, దుకాణదారులు, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు వాదిస్తున్నాయి. ఈ భవనం వక్ఫ్ ఆస్తి కాదని గతంలో వక్ఫ్ ట్రైబ్యునల్ ప్రకటించినప్పటికీ, ఈ విక్రయంపై అభ్యంతరాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి.పునరాభివృద్ధి చేసిన క్లస్టర్‌లో తమకు శాశ్వత స్థలం పొందే హక్కు ఉందని పేర్కొంటూ అద్దెదారులు, గ్రౌండ్ ఫ్లోర్ నిర్వాహకులు తమ నిరంతర స్వాధీనతను సాక్ష్యంగా చూపుతున్నారు. ఇక, స్థానికులకు మద్దతుగా నిలిచిన ఎంఐఎం నేత వారిస్ పఠాన్ ఈ కూల్చివేత చర్యను చట్టవిరుద్ధమని అభివర్ణించారు. ‘‘సుప్రీంకోర్టు, వక్ఫ్ ట్రిబ్యునల్ స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ నోటీసు జారీ చేయడం చట్టవిరుద్ధం. ఇది 140 ఏళ్ల నాటి మసీదు. అది మసీదు అని గుర్తించినంత మాత్రాన బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేయలేరు. మా న్యాయపరమైన వాదనలు వినిపించడానికి మేము కేవలం 15 రోజుల గడువు మాత్రమే కోరుతున్నాం.. ఇలా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం’’ అని పఠాన్ అన్నారు.ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడానికి , ట్రస్ట్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ ఆరోపించారు. ట్రస్ట్ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను స్థానికులు వ్యతిరేకించడం లేదని, అయితే వక్ఫ్ ట్రైబ్యునల్ ముందు వివాదం పెండింగ్‌లో ఉన్నందున, ఇరుపక్షాల వాదనలు వినకుండా ఏకపక్ష చర్యలు తీసుకోవడం పూర్తిగా తప్పని పటేల్ తెలిపారు.