ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 3:47 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తండ్రి స్మారకార్థం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ:

తండ్రి స్మారకార్థం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ:

అర్జున్ సమాచారం.జులై 13. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్: విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించి, ఉన్నత లక్ష్యాల సాధన దిశగా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తండ్రి స్మారకార్థం 14వ జయంతి సందర్భంగా రామారావుపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
మాజీ సర్పంచ్‌ నామాల సత్యవతి, తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దానిని సాధించేందుకు క్రమశిక్షణతో పట్టుదలగా కృషి చేయాలని సూచించారు.
చదువుతో పాటు మంచి ఆలోచనలు, పట్టుదల, క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని ఇప్పటి నుంచే దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తకాలు అందించడంతో పాటు వారి భవిష్యత్తు లక్ష్యాలపై అవగాహన కల్పించిన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.