కుమారుడి జన్మదినం సందర్భంగా రూ.5 వేల విలువైన నోట్ పుస్తకాల పంపిణీ.
కుమారుడి జన్మదినం సందర్భంగా రూ.5 వేల విలువైన నోట్ పుస్తకాల పంపిణీ. అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 21.రామగిరి డెస్క్ రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ సెంటినరీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఓసీపీ-3 ఉద్యోగి, పోతనకాలని గ్రామానికి చెందిన పోలు నాగరాజు–మమత దంపతుల కుమారుడు రియాన్ష్ నాలుగో జన్మదిన వేడుకలను పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు తన కుమారుడి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సుమారు రూ.5 వేల విలువైన నోట్ పుస్తకాలను అందజేశారు....