ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:11 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

జగిత్యాల ప్రతినిధి ::
అర్జున్ సమాచారం ఆగస్టు 6::

ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లలో ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీట్ల నిర్వహణ, తరుచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన, కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.పాత నేరస్థులు తిరిగి నేరాలకు పాల్పడకుండా వారిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. రౌడీ,హిస్టరీ అనుమానాస్పద,అల్లర్లు లో ప్రమేయం ఉన్నవారిని ప్రతి నెల పోలీస్ స్టేషన్ కు పిలిపించి వివరాలు తీసుకోవాలని అన్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.