మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వద్దు

సీఐటీయూ ఆధ్వర్యంలో భీమారం ఎంఈఓ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిరసన - మధ్యాహ్న భోజన కార్మికులకు ₹10 వేల వేతనం చెల్లించాలి: డీ. రంజిత్ కుమార్ భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 13 మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం భీమారం మండల ఎంఈఓ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట కార్మికులు...