రైతుల పక్షపాతికి భూ నిర్వాసితుల గోస కనిపిస్తలేదా
– బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
పెద్దపల్లి’అర్జున్ సమాచారం, 27 june 2026
రైతుల పక్షపాతిగా చెప్పుకునే ఎమ్మెల్యే విజయ రమణ రావుకు భూ నిర్వాసితుల గోస కనిపిస్తలేదా అంటూ బీ ఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మండలంని పెద్దకల్వల గ్రామం వద్ద ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణం పనులను రైతులు అడ్డుకోవడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారులు రైతులను సంప్రదించకుండా,ఏకపక్షంగా వ్యవసాయ భూముల్లో మార్కింగ్‌లు వేయడాన్ని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష తీవ్రంగా ఖండించారు. ఆందోళన చేస్తున్న భూ నిర్వాసిత రైతులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. గతంలో గ్రామ ప్రజాప్రతినిధికి చెందిన స్థలానికి సమీపంగా బైపాస్ రోడ్డు ఉండాలని నిర్ణయించిన ప్పటికీ,తాజాగా ప్రణాళికను మార్చి, చిన్న, సన్నకారు రైతుల సారవంత మైన వ్యవసాయ భూముల మీదుగా రోడ్డును మళ్లించడం వెనుక పెద్ద కుట్ర ఉందని దాసరి ఉష ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, హడావుడిగా ఎర్రజెండాలు పాతడం వెనుక అధికార పార్టీ నేతల స్వార్థం దాగి ఉందని ఆమె మండిప డ్డారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ రైతుల పొట్ట కొట్టి,వారి భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమని,ఒక రైతుకు మూడు ఎకరాల వరకు భూమి పోయే పరిస్థితి ఉంటే, ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని, దాదాపు 15 ఎకరాల సారవంతమైన భూమి ఈ సర్వే వల్ల నాశనమవుతోంది. కొందరు బడా వ్యక్తుల అక్రమ కట్టడాలను కాపాడటం కోసమే పేద రైతుల భూములను బలి ఇస్తారా అంటూ ప్రశ్నించారు. భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించకుండా,రైతుల అనుమతి లేకుండా చేసే సర్వేలను వెంటనే నిలిపివే యాలన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి, భూ నిర్వాసిత రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. రైతుల సమస్యను పట్టించు కోకుండా,బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తే రైతుల సమస్య పరిష్కారమ య్యే వరకు వారి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆమె స్పష్టం చేశారు.