మంథని ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే దుద్దిళ్ల శ్రీధర్ ఆలోచన…
మంథని . అర్జున్ సమాచారం అక్టోబర్ 3.
చరిత్రను రూపుమాపడానికే తండ్రి పేరును అంటగడుతుండుమార్కెట్‌ను కూలగొట్టి నాలుగు నెలలైనా తట్టెడు మట్టి తీయలేక మీషన్‌లు వచ్చినా ఎన్నికల వరకు కొనసాగించేలా ప్రయత్నం చేస్తుండు డిజైన్‌కే నాలుగు నెలలు పడితే కట్టడానికి ఎన్ని ఏండ్లు పడుతుందో చెప్పాలే.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
మంథనిలో ఏ ఆనవాళ్లు లేకుండా చేయాల న్నదే. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఆలోచన అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. శనివారం మంథనిలో నూతనంగా నిర్మించనున్న వెజ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను ఆయన సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ , పబ్లిక్ హెల్త్ ఈఈ అధికారులతో ఫోన్ మాట్లాడి మార్కెట్ నిర్మాణంలో జాప్యంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుద్దిళ్ల శ్రీధర్ ఎనిమిదిసార్లు గెలిచి నియోజకవర్గంలోని పిల్లల భవిష్యత్ కోసం వారి జీవితాల కోసం ఒక్కసారి కూడా ఆలోచించలేదన్నారు. కానీ మంథని చరిత్రను రూపుమాపడానికి, ప్రతి దానికి తన తండ్రి పేరు పెట్టుకోవడానికి తన తండ్రే మొత్తమని ఈ సమాజానికి ఇష్టం లేకున్నా అంటగట్టేందుకు చేస్తున్న ప్రయత్నమని ఎద్దేవా చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ అనాలోచిత నిర్ణయాలతో మంథని మార్కెట్ ఆనవాళ్లు లేకుండా పోతున్నాయని, మంథని పుట్టినప్పుడే ఈ మార్కెట్ పుట్టిందని, ఈ మార్కెట్ ఆనవాళ్లు ఉండవద్దని, చరిత్ర కనబడనీయవద్దని దుద్దిళ్ల శ్రీధర్ కుట్రలు చేస్తున్నాడని అన్నారు. నాలుగు నెలల క్రితం మార్కెట్ నిర్మాణం కోసం ఉన్న మార్కెట్‌ను డిస్మెంటల్ చేశారని, ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయకుండా ఉండటం అవమానమన్నారు. కమీషన్ రాలేదనో కమీషన్ వచ్చినా ఎన్నికల వరకు కొనసాగించాలనో పనులు ఇంకా మొదలు పెట్టడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఓట్ల కోసం పోతే మా పిల్లలు చదువుకున్నరని, ఒక ఐటీ కంపెనీ, ఇండస్ల్రీ పెట్టలేదని, నీ కుటుంబం మాత్రం వేల కోట్లు సంపాదించుకున్నారని అడుగుతరని ఒకటో రెండో బంగ్లాలు కట్టించి వీటిని చూసి మురిసిపోతరని, ఇలాగే ఎన్నికల వరకు కొనసాగించే కార్యక్రమంగా కనబడుతోందని ఆయన విమర్శించారు. మార్కెట్ నిర్మాణంపై కమీషనర్‌తో మాట్లాడితే డిజైన్స్‌కే సమయం గడిచిపోయిందని చెప్తున్నరని, అంటే నాలుగు నెలలు డిజైన్స్‌కు పోతే కట్టడానికి ఇంకా ఎన్ని ఏండ్లు పడుతుందో ఎమ్మెల్యే అధికార యంత్రాంగం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు ఓట్లు ఉన్న కుటుంబమని ప్రతిసారి చెప్తున్నా అయినా 40ఏండ్లు అవకాశం ఇచ్చినా వారి కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇంత పెద్ద సమాజంలో కూరగాయాలు అమ్ముకునెటోళ్ల ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉంటరే తప్ప దుద్దిళ్ల కుటుంబానికి చెందిన వాళ్లు ఎవరూ ఉండరు అయినా వాళ్లను ఓర్వకుండా చెట్టుకొకరు పుట్టకొకరిని చేసిండని ఆయన వాపోయారు. వేల కోట్లు సంపాదిస్తున్నా ఓట్లు వస్తే ఓటుకు ఐదు వేలు ఇస్తాననే అహాంకారంతో ఉన్నరని అన్నారు. రెండు రోజుల క్రితం కాటారంలోని మార్కెట్ ను సందర్శించడం జరిగిందని, అక్కడ కూడ ఇలాగే వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన గురించి మన పిల్లల భవిష్యత్ గురించి, కరెంటు, నీళ్ల గురించి ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. కమీషన్‌లు వచ్చాయని కాళేశ్వరం గుడిని కూలగొట్టిన చరిత్ర దుద్దిళ్లదని అన్నారు. వచ్చే ఏడాది పుష్కరాలు వస్తయని, అప్పటిలోగా మార్కెట్ పూర్తి కాకపోతే చిరువ్యాపారులకు తీరని నష్టమే ఉంటుందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంతో ఏ సంబంధం లేనోడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటదో దుద్దిళ్ల శ్రీధర్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు. శిలాఫలకం వేసి రెండేళ్లు కావస్తున్నా పనులు చేయకుండా ఇంకా ఏదో గొప్పగా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవ చేశారు. మున్సిపల్ భవనం, ఆసుపత్రి మంచిగా ఉన్నా కూడా కమీషన్ కోసం ఎక్కడెక్కడో కట్టిస్తున్నాడని, పురాతణ ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే దుద్దిళ్ల శ్రీధర్ లక్ష్యమని అర్థం అవుతుందన్నారు. నాలాంటి గరీబోడు ఎదిగితే కళ్లలో కారంపోసుకుని లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలకు దూరం చేశాడని, తుది శ్వాస వరకు ప్రజల పక్షాన పోరాటం చేసి దుద్దిళ్ల శ్రీధర్‌కు ప్రజాక్షేత్రంలో పనిస్మెంట్ ఇప్పిస్తానని అన్నారు. తనకు చిన్నప్పటి నుంచే ఈ మార్కెట్‌తో సంబంధం ఉందని, తన తండ్రి ఇక్కడే గొడ్ల అంగడి నడిపేవాడని, ఈ మార్కెట్‌తో పెనవేసుకుని పెరిగానని, అందుకే ఈ ఆందోళన అని ఆయన అన్నారు. తండ్రి ఆశయాలని పదేపదే చెప్తున్న ఎమ్మెల్యే ప్రజలను ఇబ్బంది పెట్టడం, వ్యాపారులను ఎటు కాకుండా చేయడమేనా అని ప్రశ్నించారు. మీ నాయన పేరు అసెంబ్లీకి పెట్టుకున్నవ్ కదా…జయంతి వర్థంతిలను ప్రభుత్వపరంగా జరుపుకుంటున్న మంథని ఎమ్మెల్యే చేతిలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా నలుగురికి ఉద్యోగాలు ఇప్పించని ఘనుడని ఆన్నారు. ఒకవైపు 80ఏండ్ల స్వాతంత్య్రాన్ని గొప్పగా జరుపుతుంటే మరోవైపు తాము ఆకలితో అలమటిస్తున్నామని, 40ఏండ్ల అయ్యా కొడుకుల పాలన ప్రజలకు పనిస్మెంట్‌లా ఉందన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం మార్కెట్ పనులు ఎందుకు మొదలుపెట్టలేదో జవాబు చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.