సాయిరాం యూత్ ఆధ్వర్యంలో వైభవంగా దుర్గా శరన్నవరాత్రోత్సవాలు.
సాయిరాం యూత్ ఆధ్వర్యంలో వైభవంగా దుర్గా శరన్నవరాత్రోత్సవాలు. శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. చిన్నారులకు అక్షరాభ్యాసం, మహిళలతో కుంకుమ పూజ. అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // భీమారం రిపోర్టర్: మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని రావి చెట్టు వాడలో సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు...