ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 1:32 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో,ఈడీ సోదాలు,

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో,ఈడీ సోదాలు,

హైద‌రాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 20.

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు కల‌క‌లం రేపాయి. శుక్ర‌వారం నాడు  ఏక‌కాలం రెండు చోట్ల ఏకకాలంలో  ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసులో సోదాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.  సత్తెనపల్లిలో రేఖా నాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయం అయింది. 2022-23, 2023-24, 2024-25 యాసంగి సీజన్లలో ప్రభుత్వం మిల్లింగ్ నిమిత్తం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించకుండా పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గతంలో పౌరసరఫరాల శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఈ రైస్ మిల్లులో ఏకంగా 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు స్పష్టంగా తేలింది. ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రేఖా నాయక్‌పై గతంలోనే BNS సెక్షన్లు 316(2), 316(5), 318(4), నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు అయింది.  ధాన్యం గోల్‌మాల్‌లో మనీలాండరింగ్ కోణంపై  ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
పక్కదారి పట్టించిన ధాన్యం ద్వారా సమకూరిన అక్రమ నిధులను ఎక్కడికి మళ్లించారు, వాటిని ఏయే ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టారు అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. తనిఖీల్లో భాగంగా బ్యాంకు ఖాతాల వివరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోదాలు పూర్తయిన అనంతరం ఈ వ్యవహారంలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.