ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:18 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలిఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి. ఎస్‌&పీసీ, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి

సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలిఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి. ఎస్‌&పీసీ, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి.

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 14 | రామగిరి డెస్క్.

సింగరేణి సంస్థలో యూనియన్‌ ఎన్నికల కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) నాయకులు కోరారు.

టిబిజికెఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇసంపల్లి రమేష్ సోమవారం అడ్రియాల గని మేనేజర్ హస్తి పెంచలయ్యకు, ఎస్‌&పీసీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద జమేదార్ పిల్లి కుమారస్వామికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఇసంపల్లి రమేష్ మాట్లాడుతూ.. సింగరేణిలో రెండేళ్ల కాలపరిమితితో 2023 డిసెంబర్ 27న యూనియన్‌ ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ఎన్నికలు జరిగి రెండేళ్ల తొమ్మిది నెలలకు పైగా గడిచినా తదుపరి ఎన్నికలు నిర్వహించలేదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్లు అంతర్గత కారణాలతో ఆలస్యంగా గెలుపు పత్రాలు తీసుకున్నప్పటికీ, 2026 సెప్టెంబర్ 8 నాటికి వారి కాలపరిమితి ముగిసిందని తెలిపారు.

అందువల్ల సింగరేణిలో తక్షణమే రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని రిజిస్టర్డ్‌ యూనియన్లకు సమాన హోదా కల్పించి, కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించే అవకాశం కల్పించాలని కోరారు.

ఈ విషయమై టిబిజికెఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఇప్పటికే సింగరేణి సంస్థ చైర్మన్‌, డైరెక్టర్‌ (పా)లకు వినతిపత్రాలు అందజేశారని తెలిపారు. ఇటీవల ఏపీఏ జనరల్‌ మేనేజర్‌ కొలిపాక నాగేశ్వరరావుకు కూడా వినతిపత్రం అందజేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఏఎల్‌పీ మైన్‌, ఎస్‌&పీసీ ఫిట్‌ సెక్రటరీలు వీవీ గౌడ్‌, దేవరకొండ తిరుపతి, కేంద్ర కమిటీ నాయకులు గట్టు శ్రీనివాస్‌, చిరంజీవి, బ్రాంచి సెక్రటరీ తేజ, శివశంకర్‌, బొడ్డు సమ్మయ్య, గొట్టే శ్రీనివాస్‌, కె. చంద్రశేఖర్‌, పేర్క రమేష్‌, ముజాఫర్‌ అలీ, కొమురయ్య, సందీప్‌, సతీష్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.