ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 1:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఇందిరమ్మ కుటుంబ బీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి…

ఇందిరమ్మ కుటుంబ బీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి…

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా – పంచాయతీ కార్యదర్శి మల్లేష్.

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, నవంబర్ 29 :

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భీమారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ ఒక ప్రకటనలో కోరారు.

ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించి, ప్రభుత్వం సూచించిన విధంగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

కుటుంబ పెద్దకు అనుకోని మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా బీమా పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. 18 నుండి 59 సంవత్సరాలు వయస్సు కల్గిన ప్రతీ ఒక్క రేషన్ కార్డ్ కుటుంబ పెద్ద వారి యొక్క రేషన్ కార్డ్ , ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ ప్రతులతో గ్రామ పంచాయతీ కి వచ్చి కుటుంబ భీమా ను వినియోగించుకుని తమ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవాలని పంచాయతీ కార్యదర్శి మల్లేష్ విజ్ఞప్తి చేశారు.