ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:29 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భీమారంలో పోలీస్ ల విస్తృత తనిఖీలు

భీమారంలో పోలీస్ ల విస్తృత తనిఖీలు

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 11:

మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా భీమారం ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
భీమారం మండల కేంద్రం లో 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, కిరాణా దుకాణాలు, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయాన్ని వినియోగించి అనుమానాస్పద వస్తువులు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఆరా తీశారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా భీమారం మండలంలో ఇలాంటి తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.