ఉద్యోగుల మహా ధర్నా విజయవంతానికి విస్తృత సన్నాహాలు.ఈ నెల 27న నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద భారీగా తరలిరావాలి.తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఉమ్మడి కార్యాచరణ వేదిక జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి.
అర్జున్ సమాచారం. ఆగస్టు 24. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల, ఆగస్టు 24: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద చేపట్టనున్న మహా ధర్నాను విజయవంతం చేయడానికి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఉమ్మడి కార్యాచరణ వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో విస్తృత సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖల ప్రతినిధులతో సమావేశమై మహా ధర్నా ఏర్పాట్లపై చర్చించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, నీటిపారుదల శాఖ, ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లా అటవీ శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం ప్రాథమిక సభ్యులు, ఉమ్మడి కార్యాచరణ వేదిక సభ్యులతో నిర్వహించిన సమావేశంలో గడియారం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27న నిర్వహించే మహా ధర్నాలో అటెండర్ స్థాయి ఉద్యోగి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రధాన డిమాండ్లపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ సన్నాహక సమావేశాల్లో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఉమ్మడి కార్యాచరణ వేదిక మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్వతి సత్యనారాయణ, జిల్లా ఉమ్మడి కార్యాచరణ వేదిక ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు దేశ్‌పాండే, బట్టారి వెంకటేశ్వర్లు, సుమిత్, పుప్పాల హనుమంతరావు, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, దుర్గాప్రసాద్, భూముల రామ్మోహన్, పత్తి సత్తయ్య పాల్గొన్నారు.
ఉపాధ్యక్షులు బొడ్డు శ్రావణ్ కుమార్, సుధాకర్, సహాయ ఉపాధ్యక్షులు సూరినేని గంగాధర్, ఒడిగ కృష్ణ, బి. రవీందర్, ఎస్. కిషన్, ఎ. సునీత, నాగుల గోపాల్, ప్రచార కార్యదర్శి రాంకుమార్, కార్యదర్శులు సత్యనారాయణ, తిరుపతి, వెంకటేష్, రోశయ్య, జ్యోతి, చంద్రశేఖర్ రెడ్డి, ఎ. రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.