కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్.
కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్. విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19. అమెరికాలో ఉన్నత విద్య , ఆపై మంచి ఉద్యోగం.. ఇది ప్రపంచంలోని చాలా మంది డ్రీమ్. దశాబ్దాలుగా భారతీయులకు కూడా అమెరికా ఫస్ట్ చాయిస్. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. వీసా అనిశ్చితులు, క్లిష్టమైన ఉద్యోగ మార్కెట్, మారుతున్న వలస విధానాల కారణంగా అమెరికాలో చదువుకోవాలనే విద్యార్థుల నిర్ణయాలు సంక్లిష్టంగా మారాయి. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 6 శాతం తగ్గి...