ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 3:44 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గ్రేస్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునికి సన్మానం.

గ్రేస్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునికి సన్మానం.

జన్నారం (ప్రతినిధి): అర్జున్ సమాచారం ఆగస్టు 17:

మంచిర్యాల్ జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ గాంధీనగర్ కి చెందిన మంద రాజేష్ గారిని కాంగ్రెస్ పార్టీ పోనకల్ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా గ్రేస్ పాస్టర్స్ అసోసియేషన్ మరియు క్రైస్తవ నాయకులు, ఆయనకు శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందిన ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అని అన్నారు. క్రైస్తవుల నుండి రాజకీయాల్లో ఉండడం మాకు చాలా సంతోషం అని వారు అన్నారు. రానున్న రోజుల్లో తాను ఉన్నతమైన పదవుల్లో ఉండాలని వారు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్స్,క్రైస్తవ నాయకులు,యువకులు పాల్గొన్నారు.