ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 7:09 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన ,విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన ,విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి.

అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // మంథని రిపోర్టర్.

మంథని గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో మంథని సెక్షన్ పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పుష్కర ఘాట్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టంగా సిద్ధం చేయాలని, విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో భక్తులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం దుబ్బపల్లిలో ఇటీవల ఛార్జ్ చేసిన ఎస్‌హెచ్‌జీ సోలార్ ప్లాంట్‌ను సీఎండీ పరిశీలించారు. ప్లాంట్ పనితీరు, విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్ అనుసంధానం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్లాంట్ నిర్వహణలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో ఎస్‌ఈ/ఆపరేషన్స్/పెద్దపల్లి వడ్లకొండ గంగాధర్, డీఈ/ఆపరేషన్స్/మంథని, ఏఈడీ/ఆపరేషన్స్/మంథని, ఏఈ/ఆపరేషన్స్/మంథని తదితర అధికారులు పాల్గొన్నారు.