విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు…

విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు... న్యూఢిల్లీ, అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్నలిస్టులు వార్తలు లేదా కథనాలు రాశారనే కారణంతో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవించాలని పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) కింద జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేవలం ఒక జర్నలిస్టు రాసిన కథనం ప్రభుత్వంపై విమర్శగా కనిపించిందనే కారణంతో అతనిపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని...