ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 11:57 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింహాచలం జగన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంజగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 18::

సింహాచలం జగన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంజగిత్యాల ప్రతినిధి ::
అర్జున్ సమాచారం సెప్టెంబర్ 18::

జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 18::

ఎండపల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేటీఆర్‌ను కలిసి సింహాచలం జగన్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. జగన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించినట్లు నాయకులు తెలిపారు. సింహాచలం జగన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు మండల నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, గాజుల మల్లేశం, మారం జలంధర్ రెడ్డి, కల్వల గంగాధర్ రావు, ముత్యం బలరాంరెడ్డి, రాంచందర్ గౌడ్, మాధవరావు, సందీప్, కల్వల తేజ, దూస గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.