దుద్దిళ్లపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర విమర్శలు

పోలీసుల తీరుపై ఆగ్రహం.. అధికారంలోకి వస్తే కేసులపై సమీక్ష చేస్తామని వ్యాఖ్య పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 22: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై, అలాగే పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీజీ టీవీ అధినేత పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని, ప్రజలు రాజ్యాంగం...