అడవి పంది దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

అడవి పంది దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 03 : భీమారం మండల పరిధిలోని ఖాజీపల్లి గ్రామపంచాయతీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోదరి పురుషోత్తం కుమార్తె స్ఫూర్తి రాణి (4) సోమవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో తన ఇంటి ముందరి వాకిట్లో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన అడవి పంది చిన్నారిపై దారుణంగా దాడి చేసింది. అడవి పంది బలంగా గుద్దడంతో పాప సుమారు 10 అడుగుల దూరంలో ఎగిరిపడి,...