38 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం బన్సీదర్, కౌసల్య భాయ్ లాహోటి స్మారకార్థం చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం

చెన్నూరు, అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 24.: బన్సీదర్, కౌసల్య భాయ్ లాహోటి గార్ల స్మారకార్థం చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 38 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. కరీంనగర్ రేకుర్తిలోని ఉదార నేత్ర వైద్యశాల సౌజన్యంతో, లయన్స్ క్లబ్ వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో ఈ శిబిరాన్ని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు.కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న 38 మంది గురువారం చెన్నూరుకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా చెన్నూరు లయన్స్ క్లబ్...