అల్పపీడనం నుంచి సూపర్ తుపాను వరకు….
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబరు 3.
మురసు.. అర్నబ్.. హుద్ హుద్.. తిత్లీ.. మొంథా.. ఒగ్ని.. ఈ పేర్లు వినే ఉంటారు కదా..!గత కొన్నేళ్లలో వచ్చిన తుపానుల పేర్లు ఇవి.వీటన్నింటికీ ఒక పోలిక ఉంది. అదేంటని అనుకుంటున్నారా…! ఇవన్నీ అక్టోబరు, నవంబరు నెలలో సంభవించాయి.
ఏటా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపానులలో ఎక్కువగా ఈ రెండు నెలల్లోనే ఉంటున్నాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది.ఇంతకీ అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఎక్కువగా తుపానులు ఏర్పడ్డానికి కారణమేమిటనే విషయంపై భారత వాతావరణ శాఖ, ఇన్ కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఒషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ) ఈ తుపానులు ఏర్పడటంలో సముద్ర ఉష్ణోగ్రతలు కీలక పాత్ర పోషిస్తాయని అని ఇన్ కాయిస్ శాస్త్రవేత్త బి.శివయ్య చెప్పారు.భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. 1891 నుంచి 2025 మధ్య బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుపానులు, తీవ్ర తుపానులు కలిపి 1261 ఏర్పడ్డాయి.వీటిల్లో ఎక్కువగా రెండు నెలల కాలంలో.. అంటే అక్టోబరు, నవంబరులోనే వచ్చాయి.అంతేకాదు, ఈ రెండు నెలల్లో వచ్చే తుపానుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. బంగాళాఖాతంలో 1891 నుంచి 2025 వరకు తుపానులు, తీవ్ర తుపానులు కలిపి 541 వచ్చినట్లుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇందులో అక్టోబరులో 96, నవంబరులో 126లో ఏర్పడ్డాయి.అలాగే 1891 నుంచి 2025 మధ్య తీవ్ర తుపానులు 247 ఏర్పడగా.. అక్టోబరులో 44, నవంబరులో 76 వచ్చాయి. తుపానుల విషయంలో సముద్ర ఉష్ణోగ్రతలలు, గాలుల గమనం తీరు కీలకంగా మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నైరుతి రుతుపవనాల తిరోగమనం(పోస్ట్ మాన్ సూన్) తర్వాత తుపానులు ఎక్కువగా తూర్పు తీరం వైపున ఏర్పడుతుంటాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు కె.నాగరత్న చెప్పారు.”పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు అండమాన్ కింద నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చేరుతుంటాయి.రుతుపవనాల ముందు మయన్మార్ తీరంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుంటాయి. దానివల్ల అటువైపు తుపానులు వెళుతుంటాయి.కానీ, రుతుపవనాల తిరోగమనం తర్వాత బంగాళాఖాతంలో తూర్పు తీరంవైపు సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల తూర్పు తీరంవైపు తుపానుల గమనం ఉంటుంది. ఇందుకు గాలుల గమనం కూడా సహకరిస్తుంది ” అని చెప్పారు నాగరత్న.ఈ సమయంలో బంగాళాఖాతంలో సముద్రపు ఉష్ణోగ్రతలు సగటున 26.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయని వివరించారు.”సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు రెండు సీజన్లలో ఎక్కువగా రికార్డవుతుంటాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒకసారి… అక్టోబరు, నవంబరు సీజన్లలో మరోసారి ఎక్కువగా ఉంటాయి” అని బి.శివయ్య చెప్పారు.రుతుపవనాల తర్వాత శీతాకాలం వచ్చి సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గడానికి కొంత ఆలస్యం అవుతుందని వివరించారు.ఈ పరిస్థితులతో అల్పపీడన ద్రోణి ఏర్పడటానికి పరిస్థితులు సహకరిస్తాయి” అని చెప్పారు.బంగాళాఖాతంలో ఏర్పడే తుపానులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా తీరం దాటడాన్ని గమనిస్తుంటాం.ఆంధ్రప్రదేశ్‌కు 1053.07 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరం ఉండగా, ఒడిశాకు 574.71 కిలోమీటర్ల పొడవైన తీరం ఉంది.తీరం పొడవు, తీరంలోని పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ వద్ద తుపానులు ఎక్కువగా తీరం దాటుతుంటాయని చెప్పారు నాగరత్న.”మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ వద్ద తీరంలో మలుపులు ఉంటాయి.గోదావరి, కృష్ణా నదులు కలిసే ప్రాంతాలున్నాయి.తీరంలో ఉండే మలుపులు, సముద్రంలో నదులు కలిసే ప్రాంతాలు కూడా తుపానులను ఆకర్షించడానికి కారణమవుతాయి” అని వివరించారు.2026 అక్టోబరు.. అర్నబ్ అతి తీవ్ర తుపాను.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం సమీపంలో తీరం దాటింది. ఏపీపై పెను ప్రభావం చూపించింది.2026 నవంబరు.. మురసు తీవ్ర తుపాను.. ఇది ఆంధ్రప్రదేశ్ తీరంలోని నెల్లూరు సమీపంలో తీరం దాటింది.2014 అక్టోబరు.. హుద్ హుద్ తీవ్ర తుపాను.. ఏపీలో విశాఖపట్నంపై విరుచుకుపడింది.ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రికార్డుల ప్రకారం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పెను విధ్వంసం సృష్టించింది.ఇవేకాకుండా, ఏపీ చరిత్రలో అత్యంత తీవ్రమైన తుపానుగా కోస్తా తీర ప్రాంతవాసులు చెప్పుకొనే దివిసీమ తుపాను లేదా దివిసీమ ఉప్పెన కూడా 1977 నవంబరులోనే వచ్చింది.ఈ తుపాను కారణంగా 24 లక్షల మంది ప్రభావితం అయ్యారు. పదివేల మందికిపైగా చనిపోయారని అంచనా.1996 కాకినాడలో వచ్చిన తుపాను కూడా నవంబరు నెలలో సంభవించింది.2012లో కోస్తా జిల్లాలను కుదిపివేసిన నీలం తుపాను కూడా నవంబరులోనే సంభవించింది.సముద్రంలో ఏర్పడే అల్పపీడన ద్రోణి బలపడితే వాయుగుండగా మారుతుంది. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండం.. ఆ తర్వాత తుపానుగా మారుతుంది.తుపానులలో గాలుల వేగాన్ని బట్టి విభజన ఉంటుందని భారత వాతావరణ శాఖ చెబుతుంది.ప్రభావాన్ని బట్టి తుపాను లేదా తీవ్ర తుపాను లేదా అతి తీవ్ర తుపానుగా వాతావరణ శాఖ వర్గీకరిస్తుంది. గాలుల వేగాన్ని బట్టి విభజన ఉంటుంది.గంటకు 31 కిలోమీటర్ల కంటే తక్కువగా గాలుల వేగం ఉంటే అల్పపీడన ద్రోణిగా పరిగణిస్తారు.గంటకు 31-49 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటే వాయుగుండం, 50-61 కిలోమీటర్ల వేగం ఉంటే తీవ్ర వాయుగుండంగా పిలుస్తారు.గంటకు 62-88 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటే తుపాను, 89-117 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటే తీవ్ర తుపాను, 118-167 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తే అతి తీవ్ర తుపానుగా వాతావరణ శాఖ చెబుతుంది.అదే 168-221 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తే అత్యంత తీవ్రమైన తుపాను, 222 కిలోమీటర్లకు పైబడి గాలులు వస్తే సూపర్ తుపానుగా చెబుతారు.