913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం
హైదరాబాద్:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 8.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా గత రెండేళ్లలో 1294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, తాజాగా 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ ద్వారా ఈ నియామకాలు చేపడతామన్నారు. పదో తరగతి కనీస విద్యార్హత, 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిబంధనల మేరకు ఈ నెల 30వ తేదీ నాటికి నియామకాల జాబితాను పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి నట్లు తెలిపారు. ఒక్కో ఆశా కార్యకర్తకు నెలకు రూ.10 వేల వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు.