ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 7:01 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు.

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 26. ముత్తారం.

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముత్తారం మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అత్తే చంద్రమౌళి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి, ప్రజల కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దిలీప్, వార్డు సభ్యులు సింధూర, స్రవంతి, కోమలత, రాజబాబు, ప్రసాద్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.