రాజాపూర్ గ్రామానికి తీవ్ర అన్యాయం.. 122 ఇళ్లకు పీడీ ఇవ్వలేదంటూ ఆందోళన ,

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 13:రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. గ్రామానికి సమీపంలోని ఓసీపీ-2 క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్ పనులను అడ్డుకుని క్వారీని ముట్టడించారు. తమ గ్రామంలోని నిర్వాసిత కుటుంబాల సమస్యలను పరిష్కరించకుండా బ్లాస్టింగ్ పనులు చేపట్టడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపూర్ గ్రామానికి సంబంధించి పునరావాసం, పరిహారం విషయంలో అధికారులు సమన్యాయం చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. మొత్తం 122 ఇళ్లకు ఇప్పటివరకు పీడీ ఇవ్వలేదని, దీంతో...