ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 6:04 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం.. పొన్నాంలో అవగాహన,

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం.. పొన్నాంలో అవగాహన,

చెన్నూర్ ( అర్జున్ సమాచారం. అక్టోబర్ 03):

పోషణ మాసం సందర్భంగా పొన్నారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నిమ్మల నాగరాజు, కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఐసీడీఎస్ చెన్నూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగరాజపల్లి సెక్టార్ సూపర్‌వైజర్ స్రవంతి ,పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 8 వరకు పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు. సమతుల్య ఆహారం, పోషక విలువలు, పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం సభ్యులు కె. విజయ, ఎస్. లిప్సిక, అంగన్‌వాడీ టీచర్లు కె. వనజ పాటు సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, మాజీ ఉపసర్పంచ్ నరేష్, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.