అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మహిళలు మృతి
వికారాబాద్, అక్టోబర్ 3: అర్జున్ సమాచారం డెస్క్ వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి కొండల నుంచి దిగుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన వారు ధారూర్ మండలం చింతకుంటలో జరుగుతున్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బస్సులో బయలుదేరారు. బస్సులో సుమారు 50 మందికి పైగా...