హుస్పేన్ సాగర్ టూ ప్రకాశం బ్యారేజ్ సీప్లేన్.
హుస్పేన్ సాగర్ టూ ప్రకాశం బ్యారేజ్ సీప్లేన్. హైదరాబాద్, అక్టోబరు 9 (అర్జున్ సమాచారం డెస్క్). హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నీటిపై విమానం వేగంగా దూసుకెళ్లి ఆకాశంలోకి ఎగరడం, క్షణాల్లో కృష్ణా తీరానికి చేరుకుని విజయవాడ ప్రకాశం బ్యారేజీ జలాల్లో ల్యాండ్ అవ్వడం.. వినడానికే ఎంతో అద్భుతంగా అనిపించే ఈ ఊహ త్వరలోనే నిజరూపం దాల్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్-విజయవాడ నగరాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణికులు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, శంషాబాద్-గన్నవరం విమాన సర్వీసులపై ఆధారపడుతున్నారు. అయితే, సాధారణ రవాణా వ్యవస్థకు...