వర్షాలకు గుడిసె నేలమట్టం.. తప్పిన ప్రాణాపాయం
అర్జున్ సమాచారం ప్రతినిధి, ఆగస్టు 7, కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గెళ్ళ చంద్ర మొగిలికి చెందిన గుడిసె పూర్తిగా తడిసి కూలి నేలమట్టమైంది. గుడిసె కూలిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ, అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు వేముగంటి శ్రావణ్ రెడ్డి, 4వ వార్డు సభ్యులు వేముగంటి మల్లారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెన్నపురెడ్డి...