ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:45 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తల్లిని కోల్పోయిన నలుగురు చిన్నారులకు జీవితాంతం అండగా ఉంటా..ఎమ్మెల్యే సత్యం..

తల్లిని కోల్పోయిన నలుగురు చిన్నారులకు జీవితాంతం అండగా ఉంటా..ఎమ్మెల్యే సత్యం..

జగిత్యాల ప్రతినిధి ::
అర్జున్ సమాచారం జులై 28::

వారిని నా సొంత బిడ్డల్లా చూసుకుంటా” అంటూ భరోసా..

చిన్నారులకు నూతన వస్త్రాలను అందించిన ఎమ్మెల్యే సత్యం

చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం తక్కళ్లపెల్లి లో తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులకు తానే అండగా ఉంటానని, వారి జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకొని వారిని స్వయంగా సొంత కారులో తాటిపెల్లి గురుకుల పాఠశాలకు తీసుకెల్లి అడ్మిషన్ ఫారాలను స్వయంగా నింపి ప్రవేశం కల్పించి ఇకపై విరు నా సొంత బిడ్డల్లాగ వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి సహాయం అందిస్తానన్న చొప్పదండి శాసనసభ్యులు.