ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ అక్రమ అరెస్ట్

బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ అక్రమ అరెస్ట్

పెద్దపల్లి డెస్క్ , అర్జున్ సమాచారం, సెప్టెంబర్ : 10 :

ఉపాధి, సంక్షేమ హామీల సాధన కోసం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, ఉద్యమకారుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్‌ను పోత్కపల్లి పోలీసులు గురువారం తెల్లవారుజామున 5 గంటలకు అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టులో భాగంగా శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మడమతిప్పారు. నిరుపేద విద్యార్థులకు సంబంధించిన రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఉద్యమాలను నొక్కేయలేరని, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యూత్ నాయకులు బొంగోని వెంకటేష్ గౌడ్, గడ్డం అజయ్ తదితరులు పాల్గొని పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.