తిరుపతి నగరం లో చీకటి దందా
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ఓ ఆర్గనైజర్ తో ముగ్గురు విటులు అరెస్ట్..
ఇద్దరు మహిళలు హోమ్ కు తరలింపు.
తిరుపతి . ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 5.
అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కారం పల్లి సమీపంలోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు జరిపారు. పట్టుబడిన వారిలో ఆర్గనైజర్ ఇరువురు మహిళలు, ముగ్గురు విటులు వున్నారు. వారినుంచి 1500 నగదు,10 కండోమ్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణపురం రాజీవ్ నగర్ కు చెందిన ఆర్గనైజర్ ఎం. అలివేలు మంగమ్మ, ఎస్ టి వినగర్ కు చెందిన యు. గోవర్ధన్, . కార్వేటినగరం గోపిశెట్టిపల్లికి చెందిన టి. తిరువేసు నారాయణవనం మండలం అరణ్యకండ్రిక కు చెందిన జి. సాయిబాబు లు అరెస్ట్ చేసారు. వారిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు అలిపిరి సిఐ రామకిషోర్ వెల్లడించారు.