ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 4:06 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లద్నాపూర్‌లో వరద నీటి సమస్యకు తక్షణ చర్యలుజేసీబీతో నీటి ప్రవాహానికి మార్గం ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ

లద్నాపూర్‌లో వరద నీటి సమస్యకు తక్షణ చర్యలు
జేసీబీతో నీటి ప్రవాహానికి మార్గం ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 29

రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు లద్నాపూర్ గ్రామంలో వరద నీరు చేరడంతో గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోకి చేరిన వరద నీరు నిల్వ ఉండకుండా జేసీబీ సహాయంతో నీరు వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వనం రాంచందర్ రావు పర్యవేక్షించారు. నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించి, గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అడ్డూరి శ్రీకాంత్, వార్డు సభ్యులు మల్లారపు స్వామి, అడ్డూరి శైలజ–సురేష్, గ్రామ కార్యదర్శి సతీష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.