తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి అవ‌మానం,ఇందిర‌మ్మ చీర క‌ట్టిన దుండ‌గులు.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి అవ‌మానం,ఇందిర‌మ్మ చీర క‌ట్టిన దుండ‌గులు. న‌ల్గోండ‌: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12. నల్గొండ ఎన్జీ కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి   గుర్తు తెలియని వ్యక్తులు ఇందిరమ్మ చీర కట్టిన ఉదంతం క‌ల‌క‌లం రేపింది.  తెలంగాణ తల్లి విగ్రహానికి ఇందిరమ్మ చీర కట్టడంపై స్థానిక బీఆర్ఎస్ నేతలు  ఆగ్రహం  వ్య‌క్తం చేసారు.  స‌మాచారం అందుకున్న పోలీసులు  జోక్యం చేసుకుని మున్సిపల్ సిబ్బంది తో చీర‌ను తొల‌గించారు.చీరను తొలగించాక బీఆర్ఎస్ నాయుకులు  విగ్రహానికి పాలాభిషేకం చేసారు.