సింగరేణి ఓసిపి 2 విస్తరణ సర్వేలో అక్రమాలు: రాజపూర్ గ్రామ ప్రజల నిరసన, ఉద్రిక్తత
అర్జున్ సమాచారం, ఆగస్టు 20 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని రాజపూర్ గ్రామంలో సింగరేణి ఓసిపి 2 విస్తరణ కోసం నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వే తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సర్వే తప్పులతడకగా ఉందని, దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఒంటెద్దు పోకడ వల్ల తరతరాలుగా ఈ గ్రామాన్ని నమ్ముకుని బతుకుతున్న తమకు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ సర్వేను నిరసిస్తూ గ్రామస్థులు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు...