ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 2:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దొందూ దొందే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరు ఒక్కటే!మాటలు కోటలు దాటుతున్నా.. చేతల్లో కనిపించని అభివృ,ద్ధి

దొందూ దొందే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరు ఒక్కటే!మాటలు కోటలు దాటుతున్నా.. చేతల్లో కనిపించని అభివృ,ద్ధి

మంథని మార్కెట్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారు?వచ్చే ఎన్నికల్లో మంథనిలో బీజేపీ జెండా ఎగురవేస్తాం,బీజేపీ నాయకులు సబ్బని సంతోష్‌, సామల అశోక్‌కుమార్‌.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 13 // మంథని డెస్క్‌:

మాటలు చెప్పడంలో పోటీ పడుతున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయని బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్‌, మంథని మండల ప్రధాన కార్యదర్శి సామల అశోక్‌కుమార్‌ విమర్శించారు. మంథని పట్టణంలో శాఖాహార, మాంసాహార మార్కెట్‌ నిర్మాణం ఎప్పుడు పూర్తిచేస్తారో పాలకులు స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రకటనలకే పరిమితమైన మార్కెట్‌ పనులు

మంథని డివిజన్‌ మీడియా ప్రెస్‌ క్లబ్‌లో విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ఎంతో అవసరమైన శాఖాహార, మాంసాహార మార్కెట్‌ నిర్మాణం ప్రకటనలు, శంకుస్థాపనలకే పరిమితమవుతోందని ఆరోపించారు. ఒక నెలలో శంకుస్థాపన, మరో నెలలో బోరు పనులు, ఆ తర్వాత పనులు ప్రారంభమైనట్లు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో పాలకులు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు.

ప్రజలకు ఉపయోగపడాల్సిన మార్కెట్‌ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని, వ్యాపారులు, ప్రజలకు ఎప్పటికి అందుబాటులోకి తీసుకొస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి పనులపై ప్రకటనలు చేయడం కాదని, వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే పాలకుల బాధ్యత అని స్పష్టం చేశారు.

హామీలు కాదు.. అభివృద్ధి కావాలి

మంథని ప్రజలకు రాజకీయ ప్రసంగాలు, హామీలు కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తయిన అభివృద్ధి పనులు కావాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. శాఖాహార, మాంసాహార మార్కెట్‌ నిర్మాణంపై పాలకులు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యమిస్తే ప్రజలు తగిన సమయంలో స్పందిస్తారని హెచ్చరించారు.

మంథనిలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

రానున్న ఎన్నికల్లో మంథని గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని సబ్బని సంతోష్‌, సామల అశోక్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా హామీలతో కాలం గడుపుతున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా పాలకులు స్పందించి శాఖాహార, మాంసాహార మార్కెట్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.