ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 6:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

టైగర్ జోన్ రద్దు కొరకు భూమాచారి చేస్తున్న దీక్షకు మద్దతుగా జన్నారం వ్యాపారస్తులు తాపీ మేస్త్రి సంఘం.

టైగర్ జోన్ రద్దు కొరకు భూమాచారి చేస్తున్న దీక్షకు మద్దతుగా జన్నారం వ్యాపారస్తులు తాపీ మేస్త్రి సంఘం.

టైగర్ జోన్‌కు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపు,
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 30:

కవ్వాల్ టైగర్‌ జోన్‌ పరిధిలో అమలవుతున్న ఆంక్షలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న యంత్రాల ద్వారా వ్యవసాయం చేయకూడదని ఆదివాసీలు చేపలు పట్టరాదని పట్టాభూములలో యంత్రాలతో బంటాలు బావులు త్రవ్వరాదని పశువులను అటవీప్రాంతాలలో మేతకు పోరాదని కార్లకు భారీవాహనాలకు శిస్తు కట్టాలని నిర్మాణాలకు స్థానిక ఇసుక వాడరాదని ఎలాంటి నిర్మాణాలు చేపట్టారాదని ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని టైగర్ జోన్ రద్దు చేస్తూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆదివాసీలు, రైతులు తమ సాగు భూములు, జీవనోపాధిపై ఆంక్షలు ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంద్‌కు మద్దతుగా స్థానిక వ్యాపారులు, ప్రజలు తాపీ మేస్త్రి సంఘం వారు ఆటో యూనియన్ లు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. టైగర్ జోన్‌ పేరుతో తమపై అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రజా ప్రయోజనార్ధం టైగర్ జోన్ రద్దు చేసి ప్రజలకు స్వేచ్ఛ కలిగించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు కోరుతున్నారు.