తాండూర్ కస్తూరిబాలో న్యాయమూర్తి తనిఖీ,
తాండూర్ కస్తూరిబాలో న్యాయమూర్తి తనిఖీ, పప్పుల నాణ్యతపై అసంతృప్తి.. ప్రొవిజన్ సరఫరా జాప్యంపై ఆరా. తాండూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18. బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తి శ్రాంతి సోని తాండూర్ కస్తూరిబా బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించడంతో పాటు వంటగదిని సందర్శించి భోజన ఏర్పాట్లు, ప్రొవిజన్ సరఫరా వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు.వంటల్లో ఉపయోగిస్తున్న పప్పుల నాణ్యత సరిగా ఉండటం లేదని విద్యార్థినులు న్యాయమూర్తి దృష్టికి...